జ్యోతిక ‘జాక్ పాట్’
BY Telugu Gateway2 May 2019 11:27 AM IST

X
Telugu Gateway2 May 2019 11:27 AM IST
ఒకప్పుడు టాలీవుడ్ లో మెరుపులు మెరిపించిన జ్యోతిక ఇఫ్పుడు పూర్తిగా తమిళ పరిశ్రమకే అంకితం అయిపోయారు. అంతే కాదు..ఈ మధ్య దూకుడు పెంచారు. పెళ్ళి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న జ్యోతిక ఈ మధ్య మాత్రం వరస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ‘జాక్ పాట్’ సందడి చేయటానికి వస్తున్నారు. పోలీసు అధికారిణి పాత్రలో జ్యోతిక తన సత్తా చూపనున్నారు.
జ్యోతిక, రేవతి ముఖ్యపాత్రల్లో కల్యాణ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జాక్‌పాట్’. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని సూర్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను సూర్య రిలీజ్ చేశారు. ‘‘అదిరిపోయే యాక్షన్ కామెడీ చిత్రం చూడ్డానికి రెడీగా ఉండండి. రేవతి, జ్యోతిక కలిసి నటించడం మనందరికీ జాక్‌పాట్’’ అని సూర్య వ్యాఖ్యానించారు.
Next Story