విచారంలో ఎన్టీఆర్
BY Telugu Gateway6 May 2019 11:31 AM IST

X
Telugu Gateway6 May 2019 11:31 AM IST
కెరీర్ ప్రారంభం నుంచి తనకు వెన్నంటి నిలిచిన అభిమాన సంఘం ప్రతినిధి మరణం జూనియర్ ఎన్టీఆర్ ను కలచి చేసింది. ఈ మేరకు ఆయన తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు. ‘నాకు అత్యంత ఆప్తుడు, కృష్ణా జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ ఇక లేరు అన్న వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. ‘నిన్ను చూడాలని’ చిత్రం తో మొదలయిన మా ప్రయాణం ఇలా అర్ధాంతరం గా ముగిసిపోతుంది అని ఊహించలేదు.
నటుడిగా నేను చుసిన ఎత్తుపల్లాలలో నాకు వెన్నంటే ఉన్నది నా అభిమానులు. ఆ అభిమానులలో, నేను వేసిన తొలి అడుగు నుంచి నేటి వరకు నాకు తోడు గా ఉన్న వారి లో జయదేవ్ చాలా ముఖ్యమైన వారు. జయదేవ్ లేని లోటు నాకు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబానికి నా ప్రగాఢమైన సానుభూతి ని తెలుపుతున్నాను’ అని అభిమాని మృతిపట్ల విచారణ వ్యక్తం చేశారు.
Next Story



