కెసీఆర్ తో జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శనివారం హైదరాబాద్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తో సమావేశం అయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న జగన్, భారతిలకు కెసీఆర్ ఘన స్వాగతం పలికారు. ప్రగతి భవన్ కు వచ్చిన జగన్ కు కెసీఆర్ అప్యాయంగా కౌగిలించుకున్నారు. గవర్నర్‌తో భేటీ తర్వాత నేరుగా ప్రగతిభవన్‌కు చేరుకున్న జగన్‌కు కేసీఆర్‌తో పాటు తెలంగాణ మంత్రులు స్వాగతం పలికారు. ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జగన్‌కు స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలపడంతో పాటు శాలువాతో సత్కరించారు.
ఓ జ్ఞాపికను కూడా అందజేశారు. కేటీఆర్ జగన్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకోగా.. ఆయన సతీమణి శైలిమ వైఎస్ భారతీకి సంప్రదాయంగా బొట్టు పెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్.. జగన్‌కు కుటుంబ సభ్యులు, మంత్రులు, టీఆర్‌ఎస్ ముఖ్య నేతలను పరిచయం చేశారు. ఎన్నికల ముందు కూడా ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారని పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు. అన్నట్లుగానే వైసీపీ 151 సీట్లతో రికార్డు విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ నెల30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్ తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని కెసీఆర్ ను కోరారు. తెలంగాణ సీఎం ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.