Top
Telugu Gateway

ఊరమాస్ గా ‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్

ఊరమాస్ గా ‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్
X

హీరో రామ్ పుట్టిన రోజును పురస్కరించుకుని దర్శకుడు పూరీ జగన్నాధ్ ‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లో సన్నివేశాలు..ఫైట్లు..డైలాగ్ లు చూస్తే సినిమా ఊరమాస్ గా ఉండేలా కన్పిస్తోంది. పక్కా హైదరాబాద్ లాంగ్వేజ్ లో రామ్ డైలాగ్ లు ఆకట్టుకుంటున్నాయి. ‘నాతో కిరికిరి పెట్టుకుంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలుని కట్టేసినట్లే’ అంటూ రామ్ చెప్పే డైలాగ్ టీజర్ లో హైలెట్ గా ఉంది. రామ్ తొలిసారి పూర్తి స్థాయి మాస్ హీరోగా ఇందులో చేస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థం అవుతోంది.

ఈ సినిమాలో రామ్ కు జోడీగా నిధి అగర్వాల్, నభా నటేష్ లు సందడి చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పాటల చిత్రీకరణ గోవాలో సాగుతోంది. ఇప్పటికే టాకీ పూర్తయిన విషయం తెలిసిందే. ఈ సినిమా జూన్ లేదా జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాధ్, చార్మీ కౌర్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=M3bjgAiWpPA

Next Story
Share it