Top
Telugu Gateway

సీఎం సంచలన వ్యాఖ్యలు

సీఎం సంచలన వ్యాఖ్యలు
X

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా ఎవరూ చేయని సాహసం ఆయన చేశారనే చెప్పొచ్చు. ఈ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించినన్ని సీట్లు సాధించకపోతే తానే బాధ్యత వహిస్తానని..సీఎం పదవికి కూడా రాజీనామా చేస్తానని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. పంజాబ్ లోని అన్ని సీట్లలో కాంగ్రెస్ గెలుపు ఖాయం అని పేర్కొన్నారు. పంజాబ్ లో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున అక్కడ ఉన్న 13 సీట్లలో ఎక్కువ సీట్లను కైవసం చేసుకునేందుకు సన్నాహాలు చేసింది.

ప్రస్తుతం ఆ పార్టీ చేతిలో 3 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నాయి అక్కడ. ఆరు సీట్లు బిజెపి ఖాతాలో ఉండగా..ఆప్ నాలుగు సీట్లను దక్కించుకుంది. ఈ సారి మాత్రం మెజారిటీ సీట్లు దక్కించుకుంటామని కాంగ్రెస్ పార్టీ ధీమాగా వ్యక్తం చేస్తోంది. పార్టీ అధిష్టానం కూడా ఆయా సీట్లలో గెలుపు, ఓటములకు స్థానిక నేతలే బాధ్యత వహించాలని పేర్కొంది.

Next Story
Share it