రాజ్ తరుణ్ కు జోడీగా షాలినీ పాండే
BY Telugu Gateway4 May 2019 12:21 PM IST

X
Telugu Gateway4 May 2019 12:21 PM IST
ఒక్క సినిమా. ఒకే ఒక్క సినిమాతో ఆ కుర్ర హీరోయిన్ ఫుల్ పాపులర్ అయిపోయింది. ఎందుకంటే ఆ సినిమా అంతలా సూపర్ హిట్ అయింది మరి. ఆమే అర్జున్ రెడ్డిలో నటించిన షాలిని పాండే. అర్జున్ రెడ్డి తర్వాత అడపాదడపా కొన్ని సినిమాలు చేసినా అమ్మడికి అంతగా గుర్తింపు దక్కే పాత్ర ఏదీ దొరకలేదు. ఇప్పుడు హీరో రాజ్ తరుణ్ తో జోడీ కట్టడానికి రెడీ అయింది.
రాజ్ తరుణ్ కూడా గత కొంత కాలంగా సరైన హిట్ లేక వెనకబడిపోయారు. రాజ్ తరుణ్ మరోసారి దిల్ రాజు బ్యానర్లో సినిమా చేస్తున్నాడు. ‘ఇద్దరి లోకం ఒకటే’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమాకు జీఆర్ కృష్ణ దర్శకుడు. ఈ సినిమాతో అయినా రాజ్ తరుణ్, షాలినీ పాండేలు మంచి హిట్ అందుకుంటారా? లేదా అన్నది తెలియాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే.
Next Story