‘హిప్పీ’ ట్రైలర్ వచ్చేసింది
కార్తికేయ రూట్ మార్చినట్లు లేడు. ఫస్ట్ సినిమాలో ఏ రూట్ లో అయితే వచ్చాడో..ఇప్పుడు కూడా అదే రూట్ లో ఉన్నట్లు కన్పిస్తోంది. ఈ కుర్ర హీరో చేసిన తొలి సినిమా ‘ఆర్ఎక్స్ 100’. అందులో ఉన్న హాట్ హాట్ సన్నివేశాలతో యూత్ అంతా దానికి కనెక్ట్ అయిపోయారు. కార్తికేయ చేస్తున్న రెండవ సినిమా ‘హిఫ్పీ’. ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ గురువారం నాడు విడుదల చేసింది. ట్రైలర్ చూస్తే కార్తికేయ రూట్ మార్చలేదనే విషయం అర్థం అయిపోతుంది.
ఈ ట్రైలర్‌లో కావల్సినంత బోల్డ్ కంటెంటే కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉన్నట్లు కన్పిస్తోంది. ముఖ్యంగా జేడీ చక్రవర్తితో చెప్పించే డైలాగ్‌లు బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటిస్తోంది. హిప్పీ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను నిర్మించగా.. టీఎన్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ వేసవిలోని సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://www.youtube.com/watch?time_continue=132&v=ST59nmTy9b8