Telugu Gateway
Telangana

హైదరాబాద్ బస్సులో కాల్పుల కలకలం

హైదరాబాద్ బస్సులో కాల్పుల కలకలం
X

సిటీ బస్సులో కాల్పుల కలకలం. ఒక్కసారిగా ప్రయాణికుల ఉలికిపాటు. బస్సు దిగమన్నందుకు ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. సఫారీ డ్రెస్ వేసుకున్న ఓ వ్యక్తి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగి కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో బుల్లెట్ బస్సు టాప్ వైపు దూసుకెళ్ళింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. బస్ ఆపకుండానే డ్రైవర్ ముందుకు తీసుకెళ్ళాడు.

కాల్పులు జరిపిన వ్యక్తి తో పాటు బస్సు కోసం పోలీసులు గాలిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మణికొండ 47ఎల్ వెళ్ళే బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఊహించని ఘటనతో బస్సులో ఉన్న వారంతా షాక్ కు గురయ్యారు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తిని అసలు ఎందుకు బస్సు దిగమన్నారు...దీనికే ఆయన ఎందుకు కాల్పులు జరిపాడనే వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story
Share it