Telugu Gateway
Andhra Pradesh

జీఎంఆర్ కు జగన్ ఝలక్ ఇస్తారా?

జీఎంఆర్ కు జగన్ ఝలక్ ఇస్తారా?
X

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెండర్లలో భారీ ఎత్తున గోల్ మాల్. చంద్రబాబు సర్కారు పూర్తిగా అస్మదీయ జీఎంఆర్ కు అనుకూలంగా టెండర్ నిబంధనలు మార్చి..పదేళ్ళ తర్వాత నుంచి తమకు యూజర్ డెవలప్ మెంట్ ఫీజు (యూడీఎఫ్)లో వాటా చెల్లిస్తే చాలు అంటూ కొత్త మోడల్ ను తెరపైకి తీసుకొచ్చింది. ఈ మోడల్ లో జీఎంఆర్ ఎల్1 గా నిలిచింది. అయితే ప్రభుత్వ ఉన్నతాధికారులు అసలు ఈ పద్దతే తప్పు అని తేల్చారు. జీఎంఆర్ సంస్థ ఇఫ్పటికే తమకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు దక్కినట్లు బొంబాయి స్టాక్ట్ ఎక్స్చేంజ్ (బీఎస్ ఈ) వంటి సంస్థలకు అధికారికంగా సమాచారం కూడా ఇఛ్చింది. మరి లోపాల టెండర్లు అన్నీ రద్దు చేస్తానని చెబుతున్న కొత్త సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టును కూడా సమీక్షిస్తారా?. జీఎంఆర్ కు ఝలక్ ఇస్తారా? అంటే తప్పదు అనే సంకేతాలు అందుతున్నాయి. ఎందుకంటే ఈ టెండర్ లో మొదటి నుంచి చంద్రబాబు సర్కారు ఏపీలో తొలి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణం కంటే సొంత ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసిందని చెప్పకతప్పదు.

అందుకే తొలుత పిలిచిన టెండర్ లో ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ)కి దక్కినా తమకు ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో ఏకంగా టెండర్ నే రద్దు చేశారు. అధికారులు వద్దన్నా కూడా కేబినెట్ లో పెట్టి మరీ నిర్ణయం తీసుకున్నారు. ఇది పెద్ద వివాదస్పదం అయిన సంగతి తెలిసిందే. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా విమానాల మెయింట్ నెన్స్, రిపేర్, ఓవర్ హల్ (ఎంఆర్ వో) కేంద్రంతోపాటు..ఏరో సిటీ ప్రతిపాదనలను తెరపైకి తెచ్చారు. అదే సమయంలో ప్రాజెక్టు అంచనా వ్యయాలను అడ్డగోలుగా పెంచినట్లు ఆ శాఖ వర్గాలే చెబుతున్నాయి. ఈ అంశాలు అన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్టు ‘జ్యుడిషియల్ కమిటీ స్కానర్’లోకి వెళ్ళటం ఖాయం అని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. జగన్ కనున ఈ ప్రాజెక్టు రద్దుకు సిఫారసు చేసి..మళ్ళీ కొత్త టెండర్లు పిలిస్తే అది పెద్ద సంచలనంగానే నిలవటం ఖాయం అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it