‘సైరా’ సెట్ లో భారీ అగ్నిప్రమాదం
ప్రతిష్టాత్మక సినిమా ‘సైరా నర్సింహారెడ్డి’ కి ఊహించని షాక్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా ముందుకు సాగుతున్న తరుణంలో ఊహించని ఘటన. సినిమా సెట్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఏకంగా చిత్ర నిర్మాతలకు రెండు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. చిరంజీవితో పాటు భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం కోకాపేటలోని అల్లు అరవింద్ ఫార్మ్ హౌస్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జరుగుతోంది.
ఈ సెట్‌లో శుక్రవారం తెల్లవారుజామున అగ్రి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సెట్ పూర్తిగా కాలిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలు వెల్లడి కాలేదు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ స్వయంగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ కావటంతో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు మెగా ఫ్యామిలీ. ఈ సినిమాలో హీరోయన్ గా నయనతార నటిస్తోంది.
[contact-form][contact-field label="Name" type="name" required="true" /][contact-field label="Email" type="email" required="true" /][contact-field label="Website" type="url" /][contact-field label="Message" type="textarea" /][/contact-form]