Telugu Gateway
Politics

కేంద్రంలో మళ్ళీ మోడీనే..ఎగ్జిట్స్ పోల్స్

కేంద్రంలో మళ్ళీ మోడీనే..ఎగ్జిట్స్ పోల్స్
X

ప్రాంతీయ పార్టీల ‘లెక్కలు తప్పుతున్నాయా?’ మోడీని మళ్ళీ ప్రధాని పీఠంపై కూర్చోనివ్వకుండా చేయాలనే ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించలేదా?. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీ కూటమి వర్కవుట్ కాలేదా?. జాతీయ ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూస్తుంటే కేంద్రంలో మళ్ళీ మోడీ సర్కారు రావటం ఖాయంగా కన్పిస్తోంది. ఇంచుమించు అన్ని ఛానల్స్ ఎన్డీయేకు అనుకూలంగా అంచనాలు వెలువరించటం విశేషం. యూపీఏతోపాటు..ఇతర పార్టీల సీట్లు కలుపుకున్నా కూడా అందనంత దూరంలో ఉండటం విశేషం. ప్రాంతీయ పార్టీల మధ్య విభేదాలు పక్కన పెట్టి ముందుకు రావటమే కష్టం. కానీ లెక్కలు మాత్రం ఎక్కడా విపక్షాలకు ఆశాజనంగా లేవు. మోదీకి వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీలు వీలైనన్ని చోట్ల కూటమి కట్టినా,యూపీలో ఎస్పీ-బీఎస్పీ చేతులు కలిపినా ఎన్డీయేకు విస్పష్ట మొగ్గు కనిపిస్తోందని స్పష్టం చేశాయి.

లోక్‌సభలో బీజేపీనే ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, మిత్రుల తోడ్పాటుతో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేశాయి. టైమ్స్ నౌ అంచనా ప్రకారం ఎన్డీయేకు 306 సీట్లు రానుండగా..యూపీఏకు 132 సీట్లు, ఇతరులు 104 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. రిపబ్లిక్ సీ ఓటర్ సర్వే ప్రకారం ఎన్డీయే కు 287 సీట్లు, యూపీఏకు 128 సీట్లు, ఇతరులు 127 సీట్లు వస్తాయని పేర్కొంది. న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం ఎన్డీయే 298, యూపీఏకు 118,, ఇతరులకు 126 సీట్లు, న్యూస్ నేషన్ అంచనాల ప్రకారం ఎన్డీయేకు 282-290 సీట్లు, యూపీఏకు 118-126 సీట్లు, ఇతరుల లెక్కలు 130-138 సీట్లు వస్తాయని పేర్కొంది. యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమిలో కాంగ్రెస్‌ లేకపోవడం బీజేపీకి కలిసివచ్చినట్టుగా కనిపిస్తోంది.

Next Story
Share it