రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు
BY Telugu Gateway29 May 2019 4:17 AM GMT

X
Telugu Gateway29 May 2019 4:17 AM GMT
సోనియా గాంధీ అల్లుడు..కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. గురువారం నాడు తమ ముందు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. వాద్రా మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మోడీ సర్కారు రాజకీయ కక్ష్య సాధింపుల్లో భాగంగానే తనను వేధిస్తున్నారని ఆయన గతంలో ఆరోపించారు.
సార్వత్రిక ఎన్నికల ముందు కూడా ప్రియాంక ఎన్నికల ప్రచారానికి వెళుతూ కూడా వాద్రాను ఈడీ ఆఫీసు లో దింపి పోయారు. యూపీఏ హయాంలో ఆయన పలు రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి అక్రమంగా ప్రయోజనం పొందటంతోపాటు..కారు చౌకగా భూములు దక్కించుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Next Story