‘దొరసాని’గా రాజశేఖర్ కూతురు
BY Telugu Gateway30 May 2019 8:13 PM IST
X
Telugu Gateway30 May 2019 8:13 PM IST
ఈ సినిమాలో హీరో..విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్. ఈ సినిమాలో హీరోయిన్ హీరో రాజశేఖర్ రెండో కుమార్తె శివాత్మిక. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమానే ‘దొరసాని’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ జూన్ 6న విడుదల కానుంది. సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యదార్థ సంఘటనల ఆధారంగా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో ఎమోషనల్ లవ్‌స్టోరిగా ఈ సినిమా తెరకెక్కుతోంది. పెళ్లి చూపులు నిర్మాత యష్ రంగినేని, మధుర శ్రీధర్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకే సినిమాతో ఇద్దరు స్టార్ వారసులు పరిచయం అవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Next Story