Telugu Gateway
Cinema

‘డియర్ కామ్రెడ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది

‘డియర్ కామ్రెడ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది
X

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ‘డియర్ కామ్రెడ్’ జూలై26న విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ సరసన మరోసారి రష్మిక మందన నటించింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘గీత గోవిందం’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన సంగతి తెలిసిందే. అంతే కాదు..డియర్ కామ్రెడ్ లో వీళ్ళిద్దరి లిప్ లాక్ సీన్లు కూడా యూత్ లో సినిమాపై క్రేజ్ ను పెంచేశాయి.

యూత్ కు విజయ్ ఇప్పడు ఎంతో ఆకర్షణీయ హీరోగా మారిన సంగతి తెలిసిందే. మే9న విజయ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ డియర్ కామ్రెడ్ విడుదల తేదీని ప్రకటించింది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, కన్నడ భాష‌ల్లో సినిమాను ఒకే రోజున విడుద‌ల చేస్తున్నారు.

Next Story
Share it