Telugu Gateway
Politics

వైసీపీకి 133-135 సీట్లు: సీపీఎస్ ఎగ్జిట్ పోల్

వైసీపీకి 133-135 సీట్లు: సీపీఎస్ ఎగ్జిట్ పోల్
X

అత్యంత కీలకమైన ఎన్నికల సమరం ముగిసింది. ఇది ఎగ్జిట్ పోల్ సీజన్. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంగా బాగా విన్పించిన పేరు సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్). సీపీఎస్ ఎన్నికల అనంతరం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అనంతరం జరిపిన ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించిన వివరాలను బహిర్గతం చేసింది. ఈ వివరాలు సంచలనం కలిగించేలా ఉన్నాయి. ప్రతిపక్ష వైసీపీ 50.1 శాతం ఓట్లతో 133 నుంచి 135 సీట్లు దక్కించుకోనుందని పేర్కొంది. అదే సమయంలో అధికార టీడీపీ 40.2 శాతం ఓట్లతో 37 నుంచి 40 సీట్లు చేజిక్కుంచుకుంటుందని పేర్కొంది. జనసేన ఓటు వాటా మాత్రం 7.3 శాతంగా సీపీఎస్ అంచనా వేసింది. అయితే ఈ పార్టీ గెలుచుకునే సీటు ఒక్కటే అని వెల్లడించటం విశేషం.

ఐదు సీట్లలోమాత్రం తీవ్ర పోటీ ఉందని సీపీఎస్ వెల్లడించింది. ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేనలు పోగా..ఇతరులు 2.6 శాతం ఓట్లు దక్కించుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదే సీపీఎస్ సంస్థ మార్చిలో చేసిన ప్రీ పోల్ సర్వేలో వైసీపీకి 130 నుంచి 133 సీట్లు అంచనా వేసింది. అదే టీడీపీకి 43 నుంచి 44 సీట్లు వస్తాయని పేర్కొంది. 2019 మార్చిలో మూడు లక్షల మందికి పైగా శాంపిల్ తో ఈ సర్వే చేపట్టింది. సీపీఎస్ సర్వేలో కీలకమైన విషయం ఏమిటంటే ప్రీ పోల్ సర్వే కంటే ఎగ్జిట్ పోల్ లో వైసీపీ ఓటు శాతం పెరగ్గా...టీడీపీకి మాత్రం తగ్గినట్లు తేల్చారు. అయితే ఇది నామమాత్రంగానే ఉంది.

Next Story
Share it