Telugu Gateway
Cinema

త్రిషకు ఛార్మి పెళ్లి ప్రతిపాదన

త్రిషకు ఛార్మి పెళ్లి ప్రతిపాదన
X

అవును. నిజం. ఛార్మి నిజంగానే త్రిషకు పెళ్ళి ప్రతిపాదన చేసింది. పైగా ఇప్పుడు అది చట్టబద్దం కూడా అని బహిరంగంగానే ప్రతిపాదించింది. మరి దీనిపై త్రిష ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. శనివారం నాడు త్రిష పుట్టిన రోజు. ఈ సందర్భంగా త్రిషకు ఛార్మి శుభాకాంక్షలు చెబుతూ ఈ ప్రతిపాదన చేశారు. ‘బేబీ నిన్ను ఎప్పుటికీ ప్రేమిస్తుంటాను. నువ్వు నా ప్రతిపాదన ఎప్పుడు అంగీకరిస్తావా అని ఎదురుచూస్తున్నా. పెళ్లి చేసేసుకుందాం! ఇప్పటి ఇది చట్టబద్ధం కూడా’ అంటూ ట్వీట్ చేసింది.

గతంలోనూ చార్మి ఇదే ట్వీట్ చేసింది. అప్పుడు పెళ్లికి నేను సిద్ధమే అంటూ త్రిష గతంలో రిప్లై కూడా ఇచ్చింది. వీళ్ళిద్దరూ ఒకప్పుడు టాప్ హీరోయిన్లుగా టాలీవుడ్ ను ఏలిన వారే. అయితే ప్రస్తుతం ఇద్దరూ తెలుగు సినీ రంగంలో పెద్దగా కన్పించటం లేదనే చెప్పొచ్చు. త్రిష అయితే అప్పుడప్పుడు తమిళ రీమేక్ సినిమాలతో అయినా దర్శనం ఇస్తుంది. ఛార్మి అయితే నటనకు గుడ్ బై చెప్పేసి దర్శకుడు పూరీ జగన్నాధ్ తో కలసి సినీ నిర్మాణంలో బిజీగా ఉంది.

Next Story
Share it