మోడీపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు
తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ వేదికగా ‘రాజకీయాలు’ నడుపుతున్నారు. మోడీ వ్యతిరేకంగా పార్టీలన్నింటిని ఒక తాటిపైకి తెచ్చే పనిలో ఉన్నారు. కూటమిలో కొన్ని విభేదాలు ఉండటంతో ఆయన కాంగ్రెస్ తరపున పనిచేస్తున్నట్లు కన్పిస్తోంది. అదే సమయంలో ప్రధాని మోడీని టార్గెట్ చేస్తున్నారు. ఆయన ఆదివారం నాడు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అందులో ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాలు కోడ్ ఉల్లంఘించారని..వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రచారం ముగిసిన తరవత మోడీ బద్రీనాథ్, కేదార్ నాథ్ పర్యటనలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుంది అని లేఖలో పేర్కొన్న సీఎం చంద్రబాబు. మోడీ ఆధ్యాత్మిక పర్యటన మీడియా ఛానెల్స్ నిరంతరం ప్రసారం చేయడంతో పలువురు ఓటర్లను ప్రభావితం చేస్తుంది అని లేఖలో పేర్కొన్నారు. మరి ఈ లేఖపై ఈసీ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.