Telugu Gateway
Politics

చంద్రగిరి టీడీపీ అభ్యర్ధిపై కేసు

చంద్రగిరి టీడీపీ అభ్యర్ధిపై కేసు
X

చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఏపీలో ఇప్పుడు ఓ పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అక్కడ నుంచి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మరోసారి బరిలోకి దిగగా..టీడీపీ నుంచి పులివర్తి నాని పోటీచేశారు. నియోజకవర్గంలోని కొన్ని బూత్ ల్లో అడ్డగోలుగా అక్రమాలు జరిగాయని..వీడియో ఫుటేజీ సాక్షిగా చెవిరెడ్డి ఫిర్యాదు చేయటం..ఈసీ రీపోలింగ్ కు ఆదేశించటంతో దుమారం మొదలైంది. టీడీపీ మాత్రం తాము చేసిన ఫిర్యాదులను పక్కనపెట్టి కేవలం వైసీపీ అలా ఫిర్యాదు చేస్తే ఇలా రంగంలోకి దిగి రీపోలింగ్ ఆదేశించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

చివరకు టీడీపీ ఫిర్యాదు చేసిన వాటిలో రెండు బూత్ లను కూడా జత చేసి..మొత్తం ఏడు చోట్ల రీపోలింగ్ జరిపారు ఈ ఆదివారం. హైఓల్టేజ్ టెన్షన్ తో చంద్రగిరిలో రీపొలింగ్ సాగుతోంది. ఈ తరుణంలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై కేసు నమోదు అయింది. పాకాల మండలంలోని పులివర్తివారిపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి బావమరిది కేశవులు రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. దీంతో పులివర్తి నానిపై పాకాల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

Next Story
Share it