Telugu Gateway
Cinema

అనుష్క ‘ఆర్ఆర్ఆర్’ లోకి ఎంట్రీ ఇస్తుందా!

అనుష్క ‘ఆర్ఆర్ఆర్’ లోకి ఎంట్రీ ఇస్తుందా!
X

ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన అనుష్క చాలా కాలంగా కన్పించకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే తెరమీదకు వస్తోంది. రకరకాల ప్రాజెక్టులకు ఈ స్వీటి ఓకే చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటనలు ఏమీ లేవు కానీ..పలు చిత్రాలకు ఆమె ఓకే చెప్పినట్లు టాలీవుడ్ టాక్. ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇందులో ఎన్టీఆర్ తోపాటు రామ్ చరణ్ లు కీలక పాత్రలో పోషిస్తున్న సంగతి తెలిసిందే.

అన్నింటి కంటే ముఖ్యంగా దర్శక దిగ్గజం రాజమౌళి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించనుండటం. ఇప్పుడు అనుష్క ఆర్ఆర్ఆర్ లో కీలక పాత్ర దక్కించుకున్నట్లు టాక్. ఇప్పటికే సైరా నరసింహారెడ్డిలో స్పెషల్‌ సాంగ్‌ చేసేందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు. గత కొంత కాలంగా తెలుగు తెరపై అనుష్కను చూడలేకపోయిన ఆమె అభిమానులు మాత్రం కొత్త వార్తలతో ఫుల్ కుషీకుషీగా ఉన్నారు.

Next Story
Share it