Telugu Gateway
Politics

అమిత్ షాకు హోం..నిర్మలకు ఆర్ధిక శాఖ

అమిత్ షాకు హోం..నిర్మలకు ఆర్ధిక శాఖ
X

ఊహించినట్లే జరిగింది. అత్యంత కీలకమైన హోం శాఖను ప్రధాని నరేంద్రమోడీ తన నమ్మిన బంటు అయిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు కేటాయించారు. ఇది కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. మరో కీలకమైన ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖను నిర్మలా సీతారామన్ కు అప్పగించారు. గత ప్రభుత్వంలో ఆమె రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు రక్షణశాఖను రాజ్ నాథ్ సింగ్ కు కేటాయించారు. గురువారం ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయగా, ఆయనతో పాటు 58 మంది​ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 25 మంది కేబినెట్‌ మంత్రులు కాగా.. స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు 9 మంది, సహాయ మంత్రులు 24 మంది ఉన్నారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి హోం శాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పగించారు. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు ఇలా ఉన్నాయి.

కేంద్రమంత్రులు...

1. నరేంద్ర మోదీ (ప్రధానమంత్రి)

2. రాజ్‌నాథ్‌ సింగ్ (రక్షణ శాఖ)

3. అమిత్‌ షా (హోం శాఖ)

4. నితిన్‌ గడ్కరీ (ఉపరితల రవాణా శాఖ )

5. సదానంద గౌడ (ఎరువులు, రసాయన శాఖ)

6. నిర్మలా సీతారామన్ ‌(ఆర్థిక శాఖ)

7. రాంవిలాస్‌ పాశ్వాన్‌ (వినియోగదారుల వ్యవహారాల శాఖ )

8. నరేంద్ర సింగ్‌ తోమర్‌ (వ్యవసాయ శాఖ)

9. రవిశంకర్‌ ప్రసాద్‌ (న్యాయ శాఖ)

10. హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ (ఫుడ్ ప్రాసెసింగ్‌ పరిశ్రమ)

11. థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ (సామాజిక న్యాయ శాఖ)

12. సుబ్రహ్మణ్యం జయశంకర్‌ (విదేశాంగ శాఖ)

13. రమేశ్‌ పోఖ్రియాల్‌ (మానవ వనరులు శాఖ)

14. అర్జున్‌ ముండా (గిరిజన వ్యవహారాల శాఖ)

15. స్మృతి ఇరానీ ( మహిళ శిశు సంక్షేమం, జౌళి శాఖ)

16. డాక్టర్‌ హర్షవర్థన్ (వైద్య ఆరోగ్య శాఖ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ)

17. ప్రకాశ్‌ జవదేకర్‌ (పర్యావరణ శాఖ, ప్రసార సమాచార శాఖ)

18. పీయూష్‌ గోయల్‌ (రైల్వే శాఖ)

19. ధర్మేంద్ర ప్రధాన్‌ (పెట్రోలియం శాఖ)

20. ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ (మైనారిటీ వ్యవహారాల శాఖ)

21. ప్రహ్లాద్‌ జోషీ (పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, బొగ్గు గనుల శాఖ)

22. మహేంద్రనాథ్‌ పాండే (నైపుణ్యాభివృద్ధి శాఖ ‌)

23. అరవింద్‌ సావంత్‌ (భారీ పరిశ్రమల శాఖ)

24. గిరిరాజ్‌ సింగ్‌ (పాడి, పశుగణాభివృద్ధి)

25. గజేంద్ర సింగ్‌ షెకావత్‌ (జల శక్తి)

Next Story
Share it