Telugu Gateway
Cinema

బాలీవుడ్ పై అల్లు అర్జున్ కన్ను

బాలీవుడ్ పై అల్లు అర్జున్ కన్ను
X

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన మనసులో మాట చెప్పేశాడు. తనకు బాలీవుడ్ లో సినిమాలు చేయాలని ఉందని స్పష్టం చేశాడు. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందా? అన్న ఆసక్తి అల్లు అర్జున్ అభిమానుల్లో నెలకొంది. తాజాగా అల్లు అర్జున్ ఓ ఇంటర్వూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. తనకు సినిమాల్లో కంటెంటే ముఖ్యమని..వాటి ఆధారంగానే తన నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలసి ఓ సినిమా చేస్తున్నారు.

. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. తన తండ్రి అల్లు అరవింద్ , తనకూ గొడవలు ఉన్నట్లు వచ్చిన వార్తలపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి పుకార్లు ఎక్కడ నుంచి వస్తాయో అని నవ్వేసి వదిలేశానని తెలిపారు. తాము అందరం కలిసే ఉంటున్నామని, తాము ఎప్పుడూ పని, జీవితం గురించి మాట్లాడుకుంటామని వెల్లడించారు. అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా బాక్సాఫీస్ వద్ద అంతగా ఫలితాన్ని రాబట్టలేకపోయింది.

Next Story
Share it