‘కల్కి’ ట్రైలర్ లో రాజశేఖర్ దూకుడు
BY Telugu Gateway9 May 2019 9:37 PM IST
X
Telugu Gateway9 May 2019 9:37 PM IST
సీనియర్ హీరో రాజశేఖర్ దూకుడు చూపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆయన నటించిన ‘గరుడవేగ’ సినిమా మంచి హిట్ అయింది. ఇప్పుడు అదే జోష్ లో ‘కల్కి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా చిత్ర యూనిట్ కమర్షియల్ ట్రైలర్ పేరిట వీడియోను విడుదల చేశారు.
ఈ ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా నాని విడుదల చేశారు. ట్రైలర్ రాజశేఖర్ చెప్పే ‘ఏమి సెప్తిరి ఏమి సెప్తిరి. ఎప్పుడూ ఇలాగే చెబుతారా’ డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ లో ఫైట్లు..సన్నివేశాలు సినిమాపై అంచనాలు మరింత పెంచేలా ఉన్నాయి. ఆదాశర్మ, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
https://www.youtube.com/watch?time_continue=64&v=fXDZdsSzfc0
Next Story