Telugu Gateway
Cinema

‘ఏబీసీడీ’ మూవీ రివ్యూ

‘ఏబీసీడీ’ మూవీ రివ్యూ
X

అల్లు శిరీష్. నాన్న పెద్ద నిర్మాత. అన్న పెద్ద హీరో. కానీ ఈ అల్లు వారి వారసుడికి మాత్రం సినిమాలు ఏ మాత్రం కలసి రావటం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నిరాశే. లేకపోతే ఓ మోస్తరు సినిమాతో సరిపెట్టుకోవాల్సిందే. మళయాళంలో హిట్ అయిన సినిమాను తీసుకుని తెలుగులో రీమేక్ చేశారు. అదే ఏబీసీడీ. అంటే అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ.మళయాళంలో హిట్ అయిన సినిమా అయినా సరే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఏబీసీడీని తెరకెక్కించటంలో దర్శకుడు సంజీవరెడ్డి విజయం సాధించలేకపోయారు. దీంతో అల్లు శిరీష్ కు మరోసారి నిరాశే ఎదురైంది. పైగా కథలో కూడా ఏ మాత్రం కొత్తదనం లేకుండా అదే రొటీన్ ఫార్ములాతో ముందుకు సాగింది. ఇక అసలు విషయానికి వస్తే హీరో అల్లు శిరీష్ తండ్రి సంపాదించిన డబ్బుతో నెలకు లక్షలకు లక్షలు ఖర్చు చేస్తూ అమెరికాలో ఎంజాయ్ చేస్తుంటాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తన కొడుకు దారి తప్పుతాడని భావించి ఇండియాకు పంపుతాడు తండ్రి. ఇండియాకు పంపిన తర్వాత కేవలం నెలకు ఐదు వేల రూపాయల మాత్రమే పంపుతూ ఉండటంతో ఓ స్లమ్ లో ఉంటూ కష్టంగా జీవితాన్ని లాగిస్తాడు. ఆ స్లమ్ లో ఉండే ఓ కెమికల్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారం..ఓ టీవీ ఛానల్ యూత్ ఐకాన్ అవార్డు అందుకోవటం..మధ్యలో వచ్చే కాలేజీ రొటీన్ సీన్లు తప్ప సినిమాలో ప్రేక్షకులకు జోష్ నింపే సన్నివేశాలు ఏమీ లేవు.

హీరోయిన్ రుక్షన్ థిల్లాన్ ఆకట్టుకునేలా ఉన్నా..ఆమె పాత్ర కూడా పెద్దగా ప్రాధాన్యత ఏమీ లేదు. హీరో ఫ్రెండ్ గా నటించిన భరత్ మాత్రం తన నటనలో ఈజ్ చూపించి..మంచి భవిష్యత్ ఉందని నిరూపించుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అల్లు శిరీష్ కంటే నటనలో భరత్ కే ఈజ్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. సినిమాలో కాస్తో కూస్తో నవ్వించాడు అంటే అది వెన్నెల కిషోర్ మాత్రమే. ఓ ఛానల్ న్యూస్ ఫ్రెజంటర్ పాత్ర పోషించినన వెన్నెల కిషోర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ న్యూస్ ఛానల్ ప్రజంటర్ కు సంబంధించిన హావభావాలను పూర్తిగా కాపీ కొట్టేసి వాడుకున్నారు ఈ సినిమాలో. ఒక్క మాటలో చెప్పాలంటే ఏబీసీడీ సినిమాకు దూరంగా ఉంటేనే మంచిది.

రేటింగ్ .1.75/5

Next Story
Share it