Telugu Gateway
Offbeat

సింగపూర్ ఎయిర్ పోర్టు మరో ‘ప్రపంచ రికార్డు’

సింగపూర్ ఎయిర్ పోర్టు మరో ‘ప్రపంచ రికార్డు’
X

ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాల్లో సింగపూర్ లోని ‘చాంగీ విమానాశ్రయం’ ఒకటి. ఇప్పుడు ఈ విమానాశ్రయం మరో ప్రపంచ రికార్డును నమోదు చేసింది. తాజాగా ఈ విమానాశ్రయంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఇండోర్ వాటర్ ఫాల్ (131 అడుగులు) ప్రారంభం అయింది. ఇది పర్యాటకులకు ఎంతగానో కనువిందు చేస్తోంది. డోమ్ తరహాలో ఉండే కాంప్లెక్స్ లో ఈ వాటర్ ఫాల్ ఏర్పాటు చేశారు. అక్కడే నాలుగు అంతస్థుల్లో భారీ ఎత్తున గార్డెన్ ను అభివృద్ది చేశారు. ఆ ప్రాంతాన్ని చూస్తే అసలు ఇది విమానాశ్రయమా? లేక అడవీ ప్రాంతమా అనే అనుమానం రాక మానదు.

ఆ ప్రాంతంలోనే 280 రిటైల్ అండ్ ఫుడ్ ఔట్ లెట్స్ కూడా ఉంటాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ జ్యుయెల్ వాటర్ ఫాల్ నిర్మాణం ఏకంగా నాలుగేళ్ల పాటు సాగింది అంటే ఇందులో ఎంత కసరత్తు ఉందో ఊహించుకోవచ్చు. అత్యంత రద్దీ ఉండే విమానాశ్రయంలోని మూడు టెర్మినల్స్ ను ఇది అనుసంధానం చేస్తుంది. అతిపెద్ద ఇండోర్ వాటర్ ఫాల్ చాంగీ విమానాశ్రయంలో ప్రస్తుతం ప్రత్యేక ఎట్రాక్షన్ గా మారింది. వర్షపు నీటినే ఈ వాటర్ ఫాల్ కు ఉపయోగిస్తున్నారు.

Next Story
Share it