Telugu Gateway
Politics

వీవీ ప్యాట్ లపై మళ్ళీ సుప్రీంకు పార్టీలు

వీవీ ప్యాట్ లపై మళ్ళీ సుప్రీంకు పార్టీలు
X

విపక్షాలు పట్టు వీడటం లేదు. తాజాగా సుప్రీంకోర్టు ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీ ప్యాట్ లను లెక్కించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఏ మాత్రం సరిపోదని..ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పెరగాలంటే 50 శాతం వీవీ ప్యాట్ లను లెక్కించాల్సందేనని 22 పార్టీలు చెబుతున్నాయి. ఈ మేరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేశాయి. తాము ఎవరికీ వ్యతిరేకంగా ఇది దాఖలు చేయటం లేదని..తమ లక్ష్యం వ్యవస్థపై నమ్మకం కలిగించటం మాత్రమే అని చెబుతున్నారు. సరైన వ్యవస్థ, వనరులు ఏర్పాటు చేస్తే 50 శాతం వీ వీ ప్యాట్ లను లెక్కించటం పెద్ద కష్టం కాబోదని పార్టీలు వాదిస్తున్నాయి. అంత భారీ మొత్తంలో వీవీప్యాట్ లు లెక్కించాలంటే చాలా సమయం పడుతుందన్న ఈ సీ వాదనను పార్టీలు తోసిపుచ్చాయి. 50 శాతం స్లిప్పులను లెక్కిస్తే ఎన్నికల సంఘం మీద, ఈవీఎంల మీద ప్రజలకు నమ్మకం పెరుగుతుందని పార్టీలు చెబుతున్నాయి.

మరి సుప్రీంకోర్టు ఈ రివ్యూ పిటీషనన్ పై ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేశ వ్యాప్తంగా తిరుగుతూ ఈ విషయంలో అన్ని పార్టీలను ఏకం చేస్తున్నారు. వీవీప్యాట్ ల విషయంలో 22 పార్టీలను ఒకే తాటిపైకి తేవటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో ఈవీఎంల హ్యాకింగ్ కు ఛాన్స్ ఉందని...కొన్ని రాష్ట్రాల ఈవీఎంలను రష్యాకు పంపారని..అక్కడ ఏమి జరిగిందో తెలియదని తాజాగా చంద్రబాబు ముంబయ్ లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it