Telugu Gateway
Cinema

‘వెంకీ మామ’ ఫస్ట్ లుక్ రిలీజ్

‘వెంకీ మామ’ ఫస్ట్ లుక్ రిలీజ్
X

సీనియర్ హీరో వెంకటేష్, అక్కినేని నాగచైతన్య కలసి నటిస్తున్న చిత్రమే వెంకీ మామ. ఈ సినిమాకు సంబంధించిన లోగోను శుక్రవారం విడుదల చేసిన చిత్ర యూనిట్..ఉగాది రోజున ఫస్ట్ లుక్ ను బహిర్గతం చేసింది. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా పాయల్ రాజ్ పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటించనున్నారు. గ్రామీణ ప్రాంత లుక్ ఉండేలా బియ్యపు బస్తాలపై వెంకటేష్, నాగచైతన్యలు కూర్చున్న లుక్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సంక్రాంతికి వెంకటేష్, వరుణ్ తేజ్ లు నటించిన సినిమా ఎఫ్ 2 సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎఫ్ 2 తర్వాత వెంకటేష్ చేస్తున్న సినిమా ఇదే.

Next Story
Share it