Telugu Gateway
Politics

వీవీ ప్యాట్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

వీవీ ప్యాట్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
X

సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ)కి చుక్కెదురు అయింది. వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించాల్సిన అవసరం లేదన్న కమిషన్ వాదనను కోర్టు తిరస్కరించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు లెక్కన..పార్లమెంట్ నియోజకవర్గంలో 35 వీవీ ప్యాట్ ల స్లిప్పులను లెక్కించాలని ఆదేశించింది. పార్టీలు కోరినట్లు 50 శాతం వీవీ ప్యాట్ లను లెక్కించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు విపక్షాల విజయంగా పేర్కొనవచ్చు.

దేశంలోని 21 రాజకీయ పార్టీలు వీవీ ప్యాట్ స్లిప్పుల కౌంటింగ్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఫలితాలు ఆలశ్యం అయినా సరే..ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం పెంచాల్సిన అవసరం ఉందని విపక్షాలు వాదించాయి. కాంగ్రెస్, టీడీపీతోపాటు పలు పార్టీలు ప్రమాణ పత్రాలు దాఖలు చేసి కోర్టును ఆశ్రయించాయి. ప్రస్తుతం ఒక్క వీవీ ప్యాట్ స్లిప్పులను మాత్రమే లెక్కిస్తున్నారు.

Next Story
Share it