ఆ సర్వే ఫేక్..మేం చేయలేదు
BY Telugu Gateway1 April 2019 7:57 AM GMT

X
Telugu Gateway1 April 2019 7:57 AM GMT
ఏపీ రాజకీయాలకు సంబంధించి ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక ప్రచురించిన ఓ సర్వే సోమవారం నాడు కలకలం రేపింది. అసలు తాము ఆ సర్వే చేయలేదని..అదంతా ఫేక్ అని లోక్ నీతి, సీఎస్ డీఎస్ పేర్కొంది. ఇటీవల వరకూ ప్రముఖ జాతీయ ఛానల్స్ అన్నీ ఏపీలో వాతావరణం వైసీపీకి అనుకూలంగా ఉందని తమ సర్వేల్లో వెల్లడించాయి. ఎన్నికలకు ఇంకా కేవలం పది రోజులు ఉంది అనగా ఆంధ్రజ్యోతి లోక్ నీతి, సీఎస్ డీఎస్ పేరుతో ఓ సర్వేను ప్రచురించింది.
అందులో ఏకంగా టీడీపీకి 126 నుంచి 135 సీట్లు వస్తాయని పేర్కొంది. మార్చి 11 నుంచి 19 వరకూ సర్వే చేసినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు ఎలాంటి సర్వే నిర్వహించలేదని, ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురించిన సర్వే ఫేక్ అని తేల్చిచెప్పింది. తమ అనుమతి లేకుండా సంస్థ పేరును అక్రమంగా ప్రచురించింనందుకు సంబంధిత పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సంస్థ ప్రకటించింది.
Next Story