Telugu Gateway
Politics

దండయాత్ర..ఇది చంద్రబాబు ‘యాడ్స్ దండయాత్ర’

దండయాత్ర..ఇది చంద్రబాబు ‘యాడ్స్ దండయాత్ర’
X

ఎన్నికలు అంటేనే హంగామా. హడావుడి. అందులో చేతి నిండా డబ్బు ఉన్న పార్టీకి అయితే ఇక తిరుగు ఏమి ఉంటుంది?. ఐదేళ్ళ పాటు రాష్ట్రంలో ప్రతి స్కీమ్ ను స్కామ్ గా మార్చిన చంద్రబాబు కు చేతిలో డబ్బుకు కొదవ ఏమి ఉంటుంది?. అందుకే ఎన్నికల వేళ ఒక్క మాటలో చెప్పాలంటే టీవీ ప్రేక్షకులపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు యాడ్స్ ద్వారా ‘దండయాత్ర’ చేస్తున్నారనే చెప్పొచ్చు. ప్రధాన చానళ్లలో టీడీపీ యాడ్స్ దాడి చేస్తున్న తరహాలోనే ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కూడా కొన్ని ఛానళ్లలో యాడ్స్ ఇస్తున్నా కూడా టీడీపీ యాడ్స్ దాడి ముందు అవి దిగదుడుపే. వాణిజ్య ప్రకటన అయినా..రాజకీయ పార్టీ యాడ్స్ అయినా ప్రజలకు ‘కనెక్ట్’ అయినప్పుడే ఫలితం ఉంటుంది. అంతే కానీ..చేసిన దానికి చెప్పిన దానికి సంబంధం లేకుండా డబ్బులు ఉన్నాయి కాబట్టి యాడ్స్ చేసేసి ప్రజల్లోకి వదిలేస్తే అవి నిజాలు అయిపోతాయా?. ప్రజలు వాటిని నమ్మేస్తారా? తెలియని వాళ్లు అయితే ఓకే. ఈ ఐదేళ్లలో చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేలు..ఆ పార్టీ నేతలు కొంత మంది వ్యవహరించిన తీరు..అక్కడ పరిపాలన సాగిన తీరు స్థానిక ప్రజలకు తెలియదా?.

ఓ యాడ్ లో డైలాగ్ ఇది. ‘ఆకాశంలో ఉన్న సూర్యుడికి..మా చంద్రన్న కు కులమే లేదు.’ ‘ మా ఇళ్లు చూడు. కింద ఫ్లోరింగ్ చూడు. బెడ్ రూమ్ చూడు. ఇవన్ని మీ అయ్యకానీ కట్టించాడా?. చంద్రన్న కట్టించాడురా?. మాకు తిండి పెట్టేది ఆయన. మా వెనకాల దేనికైడా అండగా నిలబడేది ఆయన. ఇరుకు కొంపల్లో బతుకుతున్న మమ్మల్ని ఇంత దర్జాగా బతికేలా చేశాడు. ఇక మీ పార్టీ వచ్చి కొత్తగా చేసేది ఏంటి? అంటూ మీటింగ్ కు రమ్మని పిలవటానికి వచ్చిన ప్రత్యర్ధి పార్టీ వాళ్లపై ఓ మహిళే దాడి చేస్తుంది. టీడీపీ యాడ్స్ లో ఇలాంటి చిత్ర విచిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ యాడ్స్ దాడి పార్టీకి మేలు చేస్తుందో లేదో తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకూ వేచిచూడాల్సిందే.

Next Story
Share it