Telugu Gateway
Telangana

ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
X

ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనంలో అప్రతిష్ట మూటకట్టుకున్న ఇంటర్మీడియట్ బోర్డు వరసగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. బోర్డు తీరుపై అటు విద్యార్ధులు..వారి తల్లిదండ్రుల నుంచి తీవ్ర్ వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఫెయిల్‌ అయిన విద్యార్థులందరికీ రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ను ఉచితంగా చేయాలని సీఎం కెసీఆర్ బుధవారం నాడు ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంటర్మీడియట్‌ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఫెయిల్‌ అయిన విద్యార్థులెవరూ దరఖాస్తు చేసుకోకున్నా రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ చేస్తామని తెలిపింది. అప్లై చేసుకోవడానికి ఇంటర్‌నెట్‌ కేంద్రాల వద్ద క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఫీజు చెల్లించి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి నగదును తిరిగి చెల్లిస్తామని తెలిపింది. మే 15 లోపు కొత్త ఫలితాలు, కొత్త మెమోలు ఇంటికి నేరుగా వస్తాయని పేర్కొంది. బోర్డు తాజా నిర్ణయం విద్యార్ధులకు ఊరట కలిగించేదే అని చెప్పొచ్చు.

Next Story
Share it