Telugu Gateway
Politics

తెలంగాణలో ప్రశాంతంగా లోక్ సభ ఎన్నికలు

తెలంగాణలో ప్రశాంతంగా లోక్ సభ ఎన్నికలు
X

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఉద్రిక్తతల మధ్య సాగగా..తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా సాగాయి. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లో క్ సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా నగరంలో ఇది మరీ దారుణంగా ఉంది. తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ గురువారం సాయంత్రం పోలింగ్ వివరాలు వెల్లడించారు. ‘రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 6 గంటల వరకు నిజామాబాద్ లో ఎన్నికలు జరిగాయి. 5 గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదు తెలంగాణ లో...ఇంకా కొన్ని ప్రాంతల్లో ఎన్నికల ప్రక్రియ సాగుతోంది. రిటర్నింగ్ ఆఫీసర్ లు తుది నివేదికలు తీసుకోని ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని తదుపరి చర్యలు తీసుకుంటాం. ఈసీఐకి మరో నివేదిక ఇవాళ రాత్రికి పంపిస్తాం.నిజామాబాద్ లో ఓటేసిన ఓటర్లకు అధికారులకు అభినందనలు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఇప్పటివరకు 557 కేసులు నమోదుఅయ్యాయి.

53 పెయిడ్ న్యూస్ కేసులు పరిష్కరించాం. ఇప్పటి వరకు 74కోట్ల 56 లక్షల రూపాయల నగదు స్వాధీనం. 185 మంది అభ్యర్థులు నిజామాబాద్ లో ఉండటం గిన్నిస్ రికార్డ్ కోసం లేఖ రాశాము. అసెంబ్లీ ఎన్నికల నుండి.ఇప్పటి వరకు 220 కోట్లు సీజ్ అయ్యింది. 45 రోజుల వరకు ఈవీఎంలకు భద్రత పరంగా చర్యలు తీసుకొంటాం. వాటికి రెండు రింగుల భద్రత ఉంటుంది. ఒకటి సెంట్రల్,రెండోది రాష్ట్ర పోలీసులు రక్షణ కల్పిస్తారు. అంతేకాదు సీసీ టీవీ కెమెరా కూడా ఉంటుంది. కావాలనుకుంటే రాజకీయ పార్టీల నేతలు కూడా అక్కడే ఉండి చూసుకోవచ్చు. ప్రత్యేక కార్యక్రమాలు చేసినప్పటికీ ఓటింగ్ శాతం చాలా వరకు తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల శాతం పెరగలేదు.’ అని తెలిపారు.

Next Story
Share it