Telugu Gateway
Politics

లోకేష్ కాదు..ఎన్టీఆరే టీడీపీ అసలు వారసుడు

లోకేష్ కాదు..ఎన్టీఆరే టీడీపీ అసలు వారసుడు
X

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఏపీలో అడ్డుకున్నారనే కోపంతో ఉన్న వర్మ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి అసలైన వారసుడు తారక్(జూనియర్ ఎన్టీఆర్) మాత్రమే అని..నారా లోకేష్ ఏ మాత్రం కాదని వ్యాఖ్యానించారు. నిజమైన, అసలైన ఎన్టీఆర్, తారక్ అభిమానులు అందరూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో చంద్రబాబును చూసిన తర్వాతే ఆయనకు ఓటు వేయాలని కోరారు.

ఈ మేరకు ట్వీట్ చేశారు వర్మ. టీడీపీకి నిజమైన, నిజాయతీ వారసుడు తారక్ మాత్రమే అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను కథానాయకుడు, మహానాయకుడుగా రెండు భాగాలను తెరకెక్కించి..అందులో నటించిన బాలకృష్ణ కు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశే మిగిలింది. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం పూర్తిగా లక్ష్మీపార్వతి కోణంలో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

Next Story
Share it