Telugu Gateway
Politics

రాహుల్ పై సుప్రీం సీరియస్

రాహుల్ పై సుప్రీం సీరియస్
X

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి ‘చౌకీదార్ చోర్’ అని కోర్టు కూడా చెప్పిందన్నట్లు రాహుల్ ఓ సభలో వ్యాఖ్యానించారు. కోర్టు అనని మాటలను రాహుల్ గాంధీ బహిరంగంగా ప్రచారం చేస్తున్నారని బిజెపి ఎంపీ మీనాక్షి లేఖి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన సుప్రీం రాహుల్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నోటీసులకు సమాధానం ఇఛ్చిన రాహుల్ ఎన్నికల ప్రచారంలో పొరపాటును తాను వ్యాఖ్యలు చేశానని..కోర్టును రాజకీయాల్లోకి లాగే ఉద్దేశం తనకు లేదంటూనే విచారం వ్యక్తం చేశారు. అయితే రాహుల్ గాందీ వివరణ సంతృప్తికరంగా లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందులో పశ్చాత్తాప పడినట్లుగా లేదని కోర్టు భావించి మరోసారి నోటీసు జారీ చేసింది.

Next Story
Share it