రమేష్ రాథోడ్ కారుకు ప్రమాదం
BY Telugu Gateway9 April 2019 10:38 PM IST

X
Telugu Gateway9 April 2019 10:38 PM IST
ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి రమేష్ రాధోడ్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే రమేష్ భద్రతా సిబ్బంది ఆయన్ను మరో వాహనంలో రిమ్స్ కు తరలించారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని ఆదిలాబాద్ నుంచి ఉట్నూరు వైపు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కారు చెట్టును ఢీకొనటంతో ఆయన తల, ఛాతి భాగంలో గాయాలయ్యాయి. కారుకు ఓ పంది అడ్డం వచ్చిన సమయంలో దాన్ని తప్పిస్తూ కారు చెట్టును ఢీకొంది. ప్రాధమిక సమాచారం ప్రకారం రమేష్ రాథోడ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
Next Story