Telugu Gateway
Politics

సుప్రీంకు రాహుల్ క్షమాపణ

సుప్రీంకు రాహుల్ క్షమాపణ
X

రాఫెల్ డీల్ కు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గత కొంత కాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ‘కాపలాదారే దొంగ’ అంటూ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఓ సమావేశంలో సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది అన్న చందంగా రాహుల్ మాట్లాడారు. అక్కడే రాహుల్ చిక్కుల్లో పడ్డారు. సుప్రీంకోర్టు అనని మాటలను రాహుల్ తన ప్రచారంలో ప్ర్రస్తావించారని..బిజెపి ఎంపీ మీనాక్షి లేఖి సుప్రీంలో పిటీషన్ దాఖలు చేశారు. ఆ వెంటనే ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులకు రాహుల్ అఫిడఫిట్ రూపంలో సమాధానం ఇచ్చారు.

రాఫెల్ తీర్పుపై తప్పుగా వ్యాఖ్యానించినందుకు కోర్టుకు క్షమాపణ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను కోర్టు ఎప్పుడూ ప్రస్తావించలేదన్నారు. కోర్టును రాజకీయాల్లోకి లాగే ఉద్దేశం కూడా తనకు లేదన్నారు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగొయ్ సారధ్యంలోని బెంచ్ మంగళవారం విచారించాల్సి ఉంది. రాఫెల్ ఒప్పందానికి సంబంధించి అంశంపై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు ఇటీవలే సమ్మతించిన విషయం తెలిసిందే. అయితే రాహుల్ క్షమాపణపై కోర్టు ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it