Telugu Gateway
Politics

వయనాడ్ లో రాహుల్ నామినేషన్

వయనాడ్ లో రాహుల్ నామినేషన్
X

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారి ఉత్తరప్రదేశ్ వెలుపల కూడా లోక్ సభ బరిలోకి దిగుతున్నారు. దక్షిణాది ప్రాంతంపై ఫోకస్ కోసమే ఇది అని చెబుతున్నా..బిజెపి నుంచి మాత్రం ఈ విషయంలో రాహుల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అమేథీలో ఓటమి భయంతోనే రాహుల్ కేరళలోని వయనాడ్ లో బరిలోకి దిగుతున్నారని బిజెపి విమర్శిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విమర్శలను తేలిగ్గా తీసిపారేస్తోంది. బిజెపినే దక్షిణాదిని నిర్లక్ష్యం చేసిందని..అందుకే తాము ఈ ప్రాంతంలో ఫోకస్ పెడుతున్నామని ఎదురుదాడికి దిగుతోంది.

ఈ విమర్శలు అన్నింటిని పక్కన పెడితే రాహుల్ గాంధీ గురువారం నాడు వయనాడ్ లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాహుల్ సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. భారీ ర్యాలీతో వెళ్ళి రాహుల్ నామినేషన్ దాఖలు చేశారు. వయనాడ్ లో కాంగ్రెస్ కు ఎంతో పట్టు ఉంది. రాహుల్ గాంధీ తొలిసారి అటు అమేథీతోపాటు ఇటు వయనాడ్ నుంచి బరిలోకి దిగుతున్నారు.

Next Story
Share it