మోడీ..వారణాసిలో ఒక్క గ్రామం తిరిగారా?
BY Telugu Gateway28 April 2019 6:57 AM GMT

X
Telugu Gateway28 April 2019 6:57 AM GMT
ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానిగా ప్రపంచం అంతా తిరిగిన మోడీ తన సొంత నియోజకవర్గం అయిన వారణాసిలో ఒక్క గ్రామాన్ని అయినా సందర్శించారా? అని ప్రశ్నించారు. వారణాసి నుంచి తాను బరిలో ఉండకూడదని పార్టీ ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం అని ప్రియాంక ఓ ఇంటర్వూలో వెల్లడించారు. తమ నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సిందిగా ఎంతో మంది ఎంపీ అభ్యర్ధులు కోరుతున్నారని..వారి కోసం ప్రచారం చేయటంపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నట్లు తెలిపారు.
తనకు కానీ..సోదరుడు రాహుల్ గాంధీకి కానీ ప్రధాని పదవిపై ఆశలేదని తెలిపారు. తాజాగా మోడీ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కు ఇచ్చిన ఇంటర్వూలోని అంశాలను ప్రస్తావించారు. దేశంలోని యువత, ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటే ఆయన మాత్రం మామిడి పండ్లు తినటం గురించి చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
Next Story