Telugu Gateway
Cinema

‘ప్రేమకథాచిత్రమ్ 2’ మూవీ రివ్యూ

‘ప్రేమకథాచిత్రమ్ 2’ మూవీ రివ్యూ
X

సుమంత్ అశ్విన్. కెరీర్ లో ఇంత వరకూ ఒక్కటంటే ఒక్క హిట్ సినిమాలేని హీరో. పాపం హారర్ జోన్ అయినా కలసి వస్తుందని ఈ మార్గం ఎంచుకున్నట్లు ఉన్నాడు. కథలో దమ్ము..కొత్తదనం, క్లారిటీ ఉంటే జోనర్ ఏదైనా పర్లేదు. కానీ తొలి భాగం హిట్ అయింది కదా అని..అదే పేరుతో పార్ట్ 2 తీస్తే కలిసొస్తొస్తుందా?. అంటే ఏ మాత్రం లేదని ప్రేమకథాచిత్రమ్ 2 తేల్చి చెప్పింది. ఎందుకంటే సినిమాలో ఎక్కువ భాగం ప్రేక్షకులు హారర్ కంటే కన్ఫ్యూజన్ కే గురవుతారు. కథలో కొత్తదనం లేకపోయినా అలా సాగిపోతూ ఉంటే చూసేవాళ్ళకు కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఈ సినిమాలో అదేమీ కన్పించదు. హరి కిషన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో సుమంత్ అశ్విన్, నందితా శ్వేత, సిద్ధి ఇద్నాని లు హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక అసలు కథ విషయానికి వస్తే కాలేజీలో ఫ్రెండ్స్ తో అలా ఆడుతూ పాడుతూ తిరగే హీరోపై అదే కాలేజీలో చదువుతున్న హీరోయిన్ మనసు పారేసుకుంటుంది. ఈ విషయం చెప్పటానికే ఓ పార్టీ ఏర్పాటు చేసి..నేరుగా లవ్ ప్రపొజ్ చేస్తుంది.

అయితే అప్పటికే మరో అమ్మాయితో ప్రేమలో ఉన్న హీరో ఆమె ప్రేమను కాదనటంతో ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. తాను ప్రేమిస్తున్న అమ్మాయితో కలసి ఏకాంతంగా గడిపేందుకు ఓ ఫాం హౌస్ కు వెళతాడు. సినిమా అంతా ఫాంహౌస్ కు వెళతారు. కథ అంతా అక్కడ ఫాం హౌస్ చుట్టూనే తిరుగతుంది. తన ప్రేమికురాలు ఇలా రాత్రిళ్ళు మాత్రమే కన్పిస్తూ ఎందుకు ఇలా దెయ్యంలా మారుతుంది..అసలు ఆమెలో ఉన్నది ఎవరు అన్నది ప్రేక్షకులను దర్శకుడు తీవ్ర గందరగోళంలోకి నెడతాడు. అది ప్రేమికుల మధ్య సమస్యగా కంటే ఓ దెయ్యాల ఆటలా ఉందనే చెప్పొచ్చు.

గతంలో లవర్‌ బాయ్‌ ఇమేజ్‌తో ఓకే సుమంత్ సుమంత్ అశ్విన్‌ హారర్‌ కామెడీతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ కాలేజ్‌ సీన్స్‌ లో పరవాలేదనిపించినా క్లైమాక్స్‌ లో వచ్చే సన్నివేశాల్లో సుమంత్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. సిద్ధి ఇద్నాని తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో పరవాలేనిపిస్తుంది. కీలక పాత్రలో నటించిన నందిత శ్వేత పాత్ర కూడా పెద్దగా పండలేదు. ప్రేమ కథా చిత్రమ్‌ సినిమాకు కొనసాగింపుగా కథను తయారు చేసుకున్న దర్శకుడు, ఆ కథను తెర మీదకు తీసుకురావటంలో సక్సెస్ కాలేకపోయాడు. ఓవరాల్ గా చూస్తే ప్రేమకథాచిత్రమ్ 2 చూస్తే అటూ భయం ఉండదు..ఇటు కామోడీ ఉండదు.

రేటింగ్. 1.75/5

Next Story
Share it