Telugu Gateway
Politics

సీఎం రమేష్ నివాసంలో పోలీసుల తనిఖీలు

సీఎం రమేష్ నివాసంలో పోలీసుల తనిఖీలు
X

తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ నివాసంలో శుక్రవారం ఉదయమే పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు జరిపారు. కడప జిల్లా పోట్లదుర్తిలోని రమేష్ నివాసంలో ఈ సోదాలు జరిపారు. ఉదయం నుంచి ఏకంగా 30 మంది పోలీసులు ఇంట్లో ప్రతి మూలలూ తనిఖీ చేశారు. పోలీసుల సోదా సమయంలో సీఎం రమేష్ తన ఇంట్లోనే ఉన్నారు. తనిఖీలకు సెర్చ్ వారంట్ ఉందా? అని సీఎం రమేష్ పోలీసులను ప్రశ్నించగా..ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము సోదాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

సుమారు గంట పాటు ఈ సోదాలు జరిగాయి. ఇటీవలే మైదుకూరు టీడీపీ అభ్యర్ధి పుట్టా సుధాకర్ యాదవ్ నివాసంలోనూ ఐటి శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐటి సోదాల సమయంలో ఎంపీ సీఎం రమేష్ దురుసుగా ప్రవర్తించారనే విమర్శలు వచ్చాయి. అయితే పోలీసుల సోదాలపై టీడీపీ మండిపడింది. కేవలం తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేసి సోదాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బిజెపి, వైసీపీలు కుమ్మక్కు అయి ఈ దాడులకు పాల్పడ్డారని సీఎం రమేష్ విమర్శించారు.

Next Story
Share it