Telugu Gateway
Politics

చంద్రబాబు సీఎం కాకుండా ఆపాలంటే దేవుడు దిగిరావాలి

చంద్రబాబు సీఎం కాకుండా ఆపాలంటే దేవుడు దిగిరావాలి
X

తెలంగాణ ఎన్నికలు చూశాం. అక్కడ వాళ్ళు ఏమి చేశారో ఇక్కడ జగన్ కూడా అదే చేశారు. సేమ్ పాలసీ. మీరు అనుకుంటున్నారు. చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రి కానియ్యకుండా చేయాలని. దేవుడు దిగి రావాలా. రేపు ఎన్నికల ఫలితాలు వస్తే అర్థం అవుద్ది. నేను నంద్యాల బై ఎలక్షన్స్ కు వెళ్ళా. చాలా మంది మీడియో సోదరులే అడిగారు. ఎవరు గెలుస్తారు అని? నేను చెప్పిందే జరిగింది. రేపు ఎన్నికల ఫలితాల్లో కూడా ఇదే రిపీట్ అవుతుంది. నేను ఎక్కువ చెప్పను. వందతో స్టార్ట్ అవుతాం. ఎక్కడ ఆగుతామో ప్రజలు నిర్ణయిస్తారు. మీ డబ్బు పని చేయదు. మా పరిపాలన పనిచేస్తది. ఎవరూ ఊహించని పరిపాలన ప్రజలకు అందించిన ప్రభుత్వం మాది. ’ అని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ పాలన ఎమర్జెన్సీని తలపించేలా ఉందని ధ్వజమెత్తారు.

సీఎం సమీక్షలపై వైసీపీ అనవసర రాద్దాంతం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల తర్వాత కూడా సీఎం సమీక్షలు చేయచ్చని ఈసీనే చెబుతోందన్నారు. మోదీ, రాజ్‌నాథ్‌, కేసీఆర్‌కు ఈసీ నిబంధనలు వర్తించవా?, బీజేపీలో ఉంటే తప్ప ఎవరూ వ్యాపారాలు చేసుకోవద్దా? అని ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్‌ అండతో 150 నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయల పంచారని ఆరోపించారు. చంద్రబాబు పేరు వింటే మోదీకి నిద్రపట్టట్లేదని వ్యాఖ్యానించారు. ఏపీలో ఈ ఎన్నికలు ఈసీకి మాయని మచ్చగా మిగిలిపోతాయని అభిప్రాయపడ్డారు. అధికారులను ఏకపక్షంగా బదిలీ చేస్తే ఈసీకి స్వయం ప్రతిపత్తి ఉంటుందా? అని ప్రశ్నించారు. 72 ఏళ్ల దేశ చరిత్రలో ఇలాంటి ఈసీని ఎప్పుడూ చూడలేదన్నారు. వీవీ ప్యాట్లు లెక్కించేందుకు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.

Next Story
Share it