తాడేపల్లిలో లోకేష్ ధర్నా
BY Telugu Gateway11 April 2019 10:50 PM IST

X
Telugu Gateway11 April 2019 10:50 PM IST
ఏపీ మంత్రి నారా లోకేష్ ధర్నాకు దిగారు. ఆయన పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఓటర్లకు సరైన సౌకర్యాలు కల్పించలేదంటూ ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు. గుంటూరు జిల్లా క్రిష్టియన్ పేట పోలింగ్ బూత్ వద్ద లోకేష్ ధర్నాకు దిగటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లోకేష్ ధర్నాకు ప్రతిగా వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడకు చేరి నినాదాలు చేశారు. రెండు పార్టీల కార్యకర్తలు గుమిగూడటంతో అక్కడ వాతావరణం వెడెక్కింది.
పోలీసులు ఇరు వర్గాలను శాంతింప చేసే ప్రయత్నం చేశారు. చివరకు లాఠీఛార్జీ కూడా చేయాల్సి వచ్చింది. పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని విమర్శించారు. ప్రతిపక్షాలు ఓటర్లను తమ హక్కు వినియోగించుకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఈ విషయంలో ఈసీ ఓటర్లకు క్షమాపణ చెప్పాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
Next Story



