Telugu Gateway
Cinema

నాని కొత్త సినిమా ‘V’

నాని కొత్త సినిమా ‘V’
X

హీరో నాని కొత్త సినిమాకు రెడీ అయిపోయారు. అయితే ఈ సినిమాలో నానితో పాటు మరో హీరో సుధీర్ బాబు కూడా ఉండబోతున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నానితో తొలి సినిమా చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో అదితి రావు హైదరీ, నివేదా థామస్ లు నటించనున్నారు. జెర్సీ సినిమా సూపర్ సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్న నాని తన కొత్త సినిమా లోగోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

ఇది నాని 25వ చిత్రం. క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. తొలిసారి తనను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఇప్పుడు మరోసారి కొత్తగా పరిచయం చేయబోతున్నారని నాని ట్వీట్ చేశారు. ‘V’ పేరుతో ఉన్న టైటిల్ ఏమిటా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. సినిమాలో ఎన్నో ట్విస్ట్ లు ఉంటాయని..ఇది మొదటి ట్విస్ట్ అని లోగోను ఉద్దేశించి సుధీర్ బాబు వ్యాఖ్యానించారు.

Next Story
Share it