Telugu Gateway
Cinema

అదరగొడుతున్న నాగార్జున

అదరగొడుతున్న నాగార్జున
X

అక్కినేని నాగార్జున తాను యూత్ కు ఏ మాత్రం తీసిపోను అని నిరూపించుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియోలో హల్ చల్ చేస్తున్న ‘మన్ముథుడు2’ ఫోటోలు ఇదే విషయాన్ని నిరూపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ హీరో పోర్చుగల్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో కలసి సందడి చేస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

నాగార్జున తోపాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా జిమ్ లో తెగ ఎక్సర్ సైజ్ లు చేస్తూ సినిమా కోసం కష్టపడుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే పి. కిరణ్ తో పాటు నాగార్జున కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఎక్కుడ భాగం పోర్చుగల్ ప్రాంతంలో జరగనుందని సమాచారం.

Next Story
Share it