రామ్ గోపాల్ వర్మపై ‘మార్ఫింగ్ కేసు’!
BY Telugu Gateway15 April 2019 10:42 AM IST

X
Telugu Gateway15 April 2019 10:42 AM IST
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీసు కేసు నమోదు అయింది. ఎన్నికలు ముగిసిన తర్వాత టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నట్లు ఫోటోను సోషల్ మీడియోలో షేర్ చేశారు. వైసీపీలో చేరిన నేతకు జగన్ కండువా కప్పిన ఫోటోను తీసుకుని..మార్ఫింగ్ ద్వారా చంద్రబాబు వైసీపీలో చేరినట్లు చూపించారు.
ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఏపీలో విడుదల కాకుండా అడ్డుకున్నారనే కారణంగా చంద్రబాబుపై వర్మ మంచి కోపంతో ఉన్నారు. టీడీపీ నేతలు కూడా వర్మపై అదే స్థాయిలో ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మార్ఫింగ్ ఫోటోను ఆసరా చేసుకుని టీడీపీ నేత ఒకరు హైదరాబాద్ లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Next Story



