Telugu Gateway
Politics

ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోండి

ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోండి
X

కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచి అధికార టీఆర్ఎస్ లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కోరారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ బాన్స్ వాడ వెళ్ళి మరీ స్పీకర్ కు పిటీషన్ అందజేశారు. తాజా పార్టీ పిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు పిటిషన్ స్పీకర్ కు అందజేశారు. సీఎల్పీ ఇప్పటికే ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ పిర్యాదు చేసింది. సీఎల్పీ ని టీఆరెస్ ఎల్పీ లో విలీనం చేసేవిదంగా అధికార పార్టీ వ్యవహరిస్తోంది ..ఇది రాజ్యాంగ విరుద్ధం అని విక్రమార్క పేర్కొన్నారు.

టీఆర్ఎస్ పార్టీ అప్రజస్వామికంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని భట్టి ఆరోపించారు. ఇదిలా ఉంటే అవసరమైన సభ్యులను చేర్చుకుని సిఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసేందుకు అధికార టీఆర్ఎస్ కూడా శరవేగంగా పావులు కదుపుతోందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా గండ్ర వెంకటరమణారెడ్డి సడన్ గా టీఆర్ఎస్ గూటికి చేరారు. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉందని సమాచారం.

Next Story
Share it