దుమ్మురేపుతున్న ‘మహర్షి’ టీజర్
BY Telugu Gateway7 April 2019 10:23 AM GMT

X
Telugu Gateway7 April 2019 10:23 AM GMT
మహేష్ బాబు దుమ్మురేపుతున్నాడు. టీజర్ తో నే రికార్డులు బద్దలు కొడుతున్నాడు. మహేష్ బాబు 25వ సినిమానే ‘మహర్షి’. టీజర్ విడుదలైన 12 గంటల లోపే 10 మిలియన్ల(కోటి)కు పైగా వ్యూస్ సాధించి ఆల్‌టైం రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు ఈ టీజర్ 12.5 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కకుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన టీజర్ యూట్యూబ్‌లో సంచలనాలు నమోదు చేస్తూ టాలీవుడ్‌లో ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డె నటిస్తోంది.
Next Story