Telugu Gateway
Cinema

ఉగాది రోజున ‘మహర్షి’ టీజర్

ఉగాది రోజున ‘మహర్షి’ టీజర్
X

మహేష్ బాబు అభిమానులకు శుభవార్త. తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘మహర్షి’ టీజర్ విడుదల కానుంది. ఈ విషయాన్ని దర్శకుడు పైడిపల్లి వంశీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీనికి ముహుర్తం కూడా నిర్ణయించారు. ఏప్రిల్ 6న ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు టీజర్ విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంబంధించి సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తి అయింది. అయితే ఇంకా పాటలతో పాటు మరికొంత భాగం పూర్తి చేయాల్సి ఉందని చెబుతున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డె నటిస్తుండగా..మరో ముఖ్య పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నారు. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్.

Next Story
Share it