Telugu Gateway
Cinema

మే1న ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల

మే1న ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల
X

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఎట్టకేలకు ఏపీలో విడుదలకు రంగం సిద్ధం అయింది. మే1న సినిమాను విడుదల చేస్తున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ఎన్టీఆర్‌ అనుభవించిన నరకం ఏపీ ప్రజలు తెలుసుకోబోతున్నారని తెలిపారు. అత్యంత వివాదాస్పదమైన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో మార్చి 29న రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయ్యే వరకు రిలీజ్‌పై హైకోర్టు స్టే విధించటంతో అప్పటినుంచి చిత్రయూనిట్ న్యాయ పోరాటం చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ టీడీపీకి చెందిన న్యాయవాది సువ్వారి శ్రీనివాసరావు, ఆ పార్టీ నాయకుడు పి.మోహన్‌రావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఉండటం, ఎన్నికలు పూర్తవటంతో సినిమా విడుదలకు ఇక ఎలాంటి అడ్డంకులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు.

Next Story
Share it