Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ కు జోడీ కుదిరిందా?!

ఎన్టీఆర్ కు జోడీ కుదిరిందా?!
X

ఎన్టీఆర్ హీరోయిన్ పై రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో తొలుత ఎన్టీఆర్ కు జోడీగా అనుకున్న భాలీవుడ్ భామ డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కారణాలు ఏంటో తెలియదు కానీ..ఆమె సినిమా నుంచి ఆకస్మికంగా తప్పుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలు నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్‌ చరణ్‌కు జోడిగా అలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు డీ వీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ ను ఎన్టీఆర్‌ ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇప్పటికే ఈ పాత్రకు నిత్యామీనన్ ను కూడా సంప్రదించినట్లు టాలీవుడ్ టాక్. అయితే ఎన్టీఆర్ జోడీ ఎవరనేది త్వరలోనే చిత్ర యూనిట్ ఖరారు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

Next Story
Share it