Telugu Gateway
Cinema

నాని ‘జెర్సీ’ ఏప్రిల్ 19న

నాని ‘జెర్సీ’ ఏప్రిల్ 19న
X

నాని కొత్త సినిమా ‘జెర్సీ’ ట్రైలర్ కు విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ వీక్షించిన వారి సంఖ్య పది లక్షలకు చేరువలో ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని మిడిల్‌ ఏజ్‌ క్రికెటర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. జెర్సీ సినిమాలో నానికి జోడిగా కన్నడ బ్యూటీ శ్రధ్ధా శ్రీనాధ్ నటిస్తోంది. ఈ సినిమాలో నాని 36 ఏళ్ల వ్యక్తిగా ఓ కుర్రాడికి తండ్రిగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ అనిరుధ్ రవిచంద్రన్‌ సంగీతమందిస్తున్నాడు.

https://www.youtube.com/watch?v=AjAe_Q1WZ_8

Next Story
Share it